

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 26 రిపోర్టర్ సలికినీడి నాగు
దేశ భవిష్యత్తుకు ఆశాకిరణం ఎర్రజెండానే సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్ చిలకలూరిపేట:
తాడిత,పీడిత ప్రజానీకానికి, కార్మిక, కర్షకకులకు అండగా నిలచి, వారి సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టు పార్టీ అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్ అన్నారు. శనివారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో వినుకొండలో ఆగస్టు 7 8 తేదీల్లో నిర్వహించనున్న జిల్లా మహాసభల గోడపత్రికలను ఆయన ముఖ్య అతిధిగా హాజరై పార్టీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మారుతీవరప్రసాద్ మాట్లాడుతూ వినుకొండలో ఆగస్టు 7,8 తేదీల్లో జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీ వినుకొండ పట్టణంలో భారీ ప్రదర్శన, 8వ తేదీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం, దేశ స్వతంత్రం కోసం పోరాడిందని గుర్తు చేశారు. పల్నాడు జిల్లా సమగ్ర సమక్రాభివృద్ధిలో ఎన్నో పోరాటాలు చేసి సీపీఐ ప్రజలకు బాసటగా నిలిచిందని, పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం కుల మతాల మధ్య ప్రధాని మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెడుతుందని ఆరోపించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పెత్తందారుల పక్షాన మోడీ ఊడిగం చేస్తున్నారని, కార్మిక చట్టాలను తుంగల్లో తొక్కారని మండి పడ్డారు. దేశ భవిష్యత్తుకు ఆశాకిరణం ఎర్రజెండాయేనని, రాబోయే రోజులలో భారత కమ్యూనిస్టు పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి కార్యదర్శి తాళ్లూరు బాబురావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని,నియోజకవర్గ సహాయ కార్యదర్శి బొంతా ధనరాజ్, ఏఐటీయూసీ కార్యదర్శి దాసరి వరహాలు,గ్రామ సర్పంచ్ బొంతా తిరుపతయ్య, వేలూరు గ్రామ కార్యదర్శి ఎలికా శ్రీనివాసరావు,సహాయ కార్యదర్శి ఉట్ల వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీ బొంత సుబ్బారావు,లెనిన్ శాఖ కార్యదర్శి చిరంజీవి, నాయకులు కందిమల్ల వెంకటేశ్వర్లు, చౌటుపల్లి నాగేశ్వరరావు షేక్ నన్నే,సయ్యద్ నానా,సౌటుపల్లి బాబు,బొంత నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.