Listen to this article

వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి.

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 26 (జనం న్యూస్):

2019-24 వరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ విభాగం సెక్రటరీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, నెమలిదిన్నె చెన్నారెడ్డి స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీతో ఇతర రాష్ట్రలను పోల్చి చూశాయని నెమలిదిన్నె చెన్నారెడ్డి తెలిపారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… వైయస్ జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. హామీల అమల్లో విఫలమైందని మండిపడ్డారు.ప్రజల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందని.. వైయస్ఆర్‌సీపీ ప్రజలతో కలిసి కూటమి హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే దాన్ని భరించలేక చంద్రబాబు తనకలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ లను బయటకు తీసి వైయస్ఆర్‌సీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని తేల్చి చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా.. వైయస్ఆర్‌సీపీ ప్రజల పక్షానా నిలబడుతుందన్నారు.