

ఘనంగా కార్గిల్ విజయ దినోత్సవం
స్కూల్ కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు
జనం న్యూస్ 26 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్ కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు భారతదేశ రక్షణ సైన్యం చేసినటువంటి ధైర్య సాహసాలను వివరిస్తూ 1999 సంవత్సరంలో లడక్ లోని ఉత్తర కార్గిల్ జిల్లాలో పర్వత శిఖరాలపై పాకిస్తాన్ దళాలను తమ ఆక్రమిత స్థానాల నుండి తరిమికొట్టినందుకు కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ పైన భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రతి సంవత్సరం జూలై 26న భారతదేశంలో కార్గిల్ విజయ్ దివాస్ ను కార్గిల్ విజయ దినోత్సవాన్ని జరుపుకుంటామని విద్యార్థిని విద్యార్థులకు తెలియచేశారు. భారత సైన్యం చేసినటువంటి పోరాట సాహసాలను గుర్తు చేసుకుంటూ భారతదేశం పట్ల అందరికీ ఉండాల్సినటువంటి దేశభక్తి గురించి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని భావి భారత పౌరులుగా అభివృద్ధి చెందేటువంటి విద్యార్థిని విద్యార్థులకు తమ భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంతో ధైర్యంగా పోరాడినటువంటి విషయాలను సాధించిన విజయాలను తెలియజేయడం వల్ల విద్యార్థులు విద్యార్థులు ధైర్య సాహసాలు దేశభక్తి గురించి అర్థం చేసుకుంటారని ఈ కార్యక్రమంలో వివరించామని తెలిపారు. అలాగే విద్యార్థిని విద్యార్థులు జాతీయగీతం ఆలపించి జాతీయ జెండా పట్టుకుని దేశభక్తి గీతాలు ఆలపించి నృత్యాలు చేసి దేశభక్తిని చాటుకున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పుష్కరీ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ నవీన్, వైస్ ప్రిన్సిపాల్ మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు తిరుపతి, ఉపాధ్యాయులు సరిత, శ్వేత, లావణ్య, కవిత, మమత, కావ్య, కృష్ణ, రాజేశ్వరి, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
