

జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గిరిజన సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులు పంపించామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డి.వి.జీ.శంకరరావు తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో మాట్లాడారు. గిరిజన యూనవర్సిటీలో రిజర్వేషన్ శాతం పెంచాలని కోరారు. గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు కలిగేలా బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. జీసీసీలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేయాలన్నారు.