Listen to this article

సొంత నిధులతో.ఆరో మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు

జనం న్యూస్. జూలై 26. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత నిధులతో మినీ ఆరో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. శనివారం నాడు కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి రిబ్బన్ కట్ చేసి మినీ ఆరో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ ఇప్పటివరకు త్రాగునీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ అసౌకర్యానికి గురవుతున్నారన్న విషయం. ఆవుల రాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. తక్షణమే స్పందించిన ఆయన. రెండు రోజుల వ్యవధిలోనే ఈ మినీ ఆర్వో వాటర్ ప్లాంట్ ను హత్నూర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసి విద్యార్థులకు శాశ్వత పరిష్కారం చూపారని విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో మినీ ఆరో వాటర్ ప్లాంట్ ఎంతో కీలకంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఇప్పటివరకు మేము బాటిల్ నీటిపై ఆధార పడాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఇప్పుడు కళాశాలలో స్వచ్ఛమైన నీరు లభించడం చాలా సంతోషకరంగా ఉందని ఆవుల రాజిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆవుల రాజు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం మరియు భవిష్యత్తు నాకు చాలా ముఖ్యమని ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రభుత్వ కళాశాలలో వ్యక్తిగతంగా చేపట్టిన మినీ ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అదే నాకు పెద్ద ఆనందమని ఇది నా సామాజిక బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా కళాశాలలో రోజు వందలాది మంది విద్యార్థులకు వృద్ధి చేసిన త్రాగునీటి లభ్యత కలగనున్నదని.అలాగే అవసరమున్న ఇతర విద్యాసంస్థల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానని రాజిరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో. మండల పార్టీ అధ్యక్షులు కర్రె కృష్ణ. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ యూత్ మోటివేటర్ అజయ్ మారుతీ రావు. టిపిసిసి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎం ఏ హకీం.బోరుపట్ల కిష్టయ్య. మాజీ సర్పంచులు కొన్యాల వెంకటేశం.ఆకుల కిష్టయ్య. శ్రీనివాస్ రెడ్డి.మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రాజేందర్ ముదిరాజ్. ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఆసిఫ్ అలీ. సురేందర్ రెడ్డి.నాయకులు సత్యం.నల్లోల్ల పెంటయ్య. పేంటేష్.పొట్లచెరు నరేందర్. చెన్నారెడ్డి.అజీజ్.ఎన్ ఎస్ యు ఐ నాయకులు.రియాజ్ అలీ.చార్ల మణిదీప్.హరీష్ వర్ధన్.చక్రవర్ధన్.ప్రభు లింగం. అబ్దుల్ ఖదీర్. వల్లి గారి సాయికుమార్.వివిధ గ్రామాలకు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.