

జనం న్యూస్ జులై 26 నడిగూడెం
మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం మండల కేంద్రంలో కొల్లుకోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్ లో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా షేక్ సుభాని,ప్రధాన కార్యదర్శిగా చేకూరి నాగరాజు, ఉపాధ్యక్షులుగా మొలుగూరి నరసింహారావు,చిమట నాగరాజు, గంటపొంగు వెంకన్న,సహాయ కార్యదర్శిగా చాపల అనిల్ ఎన్నికయ్యారు.ముఖ్యఅతిథిగా జిపి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గం సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నడిగూడెం మండల కన్వీనర్ మల్లెల వెంకన్న, సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, గ్రామపంచాయతీ కార్మికులు శీను, యాతాకుల వీరస్వామి,లచ్చయ్య, సక్కుబాయి, రామకృష్ణ,వెంకన్న, వెంకటమ్మ,ఉపేంద్రమ్మ,సంతోష్, ప్రమోదు, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.