

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ
జనం న్యూస్,మునగపాక, జూలై 27:
ఉత్తరాంధ్ర అభివృద్ధికి మాత్రమే కాకుండా అక్కడి నాయకులకు గౌరవం కల్పించడంలోనూ తెలుగుదేశం పార్టీనే ముందుందని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉత్తరాంధ్రకు మంచి రోజులు మళ్లీ వచ్చాయని అన్నారు.ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్ పదవిని రావడం, కింజరపు రామ్మోహన్ నాయుడుని కేంద్ర విమానయాన మంత్రిగా ఎంపిక చేయడం, సామాన్య కుటుంబానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడుని ఎంపీగా అవకాశం ఇవ్వడం వంటి ఘనతలు టీడీపీకి మాత్రమే చెల్లుతాయన్నారు.అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్రలో విద్యా సంస్థలు, ఆలయాల అభివృద్ధికి వేల ఎకరాల భూములను దానంగా ఇచ్చారని గుర్తు చేస్తూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.గతంలో నారా లోకేష్ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేసినా, జగన్ ప్రభుత్వం వాటిని తొలగించిందని తెలిపారు. కానీ నేడు చంద్రబాబు నాయకత్వంలో టీసీఎస్, కాగ్నిజెంట్,గూగుల్ డేటా సెంటర్లు విశాఖకు రావడం,ఐటీ సెజ్, ఎన్టీపీసీ గ్రీన్, భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ లాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో నెలకొనడం గర్వకారణమన్నారు.సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ నాయకత్వం వల్లే సాధ్యమైందని, ఉత్తరాంధ్ర ప్రజలపై వారు చూపుతున్న ఆదరణ, అభిమానానికి ఇది నిదర్శనమని కర్రి సాయికృష్ణ వివరించారు. ఈ విలేకర్ల సమావేశంలో సాయికృష్ణతో పాటు మునగపాక మండల అధ్యక్షుడు పెంటకోట విజయ్, కార్పోరేషన్ డైరెక్టర్ భీమరశెట్ట్ శ్రీనివాస్,పెంటకోట శ్రీరామమూర్తి పాల్గొన్నారు.