

పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి
పిల్లలు మొబైల్ ఫోన్ వాడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి
ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ జూలై 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిలసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు.యువత సరైన దారిలో నడిచేలా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని, వారు ఏం పనులు చేస్తున్నారో ఓ కంట కనిపెడుతుండాలని సూచించారు.ఖాళీగా తిరగడం వలన వారి ఆలోచనలు చెడు వ్యసనాలపై పడే అవకాశాలు ఉంటాయని అటువంటి సమయంలో బాధ్యతను పెంచే ఆలోచనలపై దృష్టి మరల్చేలా చేయాలని అన్నారు.గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత చెడు మార్గాల వైపు వెళ్లకూడదని అన్నారు. ముఖ్యంగా గంజాయి,మత్తు పదార్థాలు, డ్రగ్స్, ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటుపడితే కుటుంబాలు వీధిన పడుతాయని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండటమే కాకుండా.. వారికి సాధ్యమైనంత వరకు ఫోన్ ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.