

రైతులకు అందుబాటులో ఎరువులను అందించాలి..
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి డా.శరత్ ఐఏఎస్.
జనం న్యూస్. జూలై 26. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
రైతులకు ఎరువులు అధిక ధరలకు అమ్మితే,కల్తీ ఎరువులను సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి,ప్రభుత్వ గిరిజన సంక్షేమ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా.శరత్ ఐఏఎస్ హెచ్చరించారు. సంగారెడ్డి నుండి మెదక్ వెళుతున్న క్రమంలో మార్గమధ్యంలోని హత్నూర మండలం దౌల్తాబాద్ పట్టణంలోని చంద్రయ్య ఫర్టిలైజర్ ఎరువుల విత్తనాల డీలర్ యజమాని దుకాణంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు.ఎరువుల షాపులోని లైసెన్సు.స్టాక్, రిజిస్టర్,బిల్ రిజిస్టర్, యూరియా,డి ఏ పి,ఇతర పురుగుల మందులు ఫర్టిలైజర్ స్టాక్ ను,సీడ్స్ డీలర్స్ కచ్చితంగా ఉండాలని అన్నారు,ఫర్టిలైజర్ యజమానులు రైతులకు ఎరువులు అమ్మకాలపై రిజిస్టర్ స్టాక్ బోర్డ్ ను ఈపాస్ మిషన్ ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు అమ్మకాలపై సరిగా ఉన్నాయా లేదా అని తనిఖీలు చేశారు. అదేవిధంగా ఫర్టిలైజర్ యజమానులకు ప్రతిరోజు ఎరువుల స్టాక్.ధరల పట్టికను నోటీస్ బోర్డ్ పై ఉండే విధంగా చూడాలని సూచించారు, రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందుబాటులో ఉండే విధంగా ఫర్టిలైజర్ యజమానులకు వ్యవసాయ అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి,శివ ప్రసాద్.డివిజన్ వ్యవసాయ అధికారి రమాదేవి. మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్.తదితరులు ఉన్నారు.
