Listen to this article

జనం న్యూస్,జూలై27,అచ్యుతాపురం:


అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాలు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎలమంచిలి నియోజవర్గం అచ్యుతాపురం మండలం లోగల తిమ్మరాజుపేట రాజన్నపాలెం,సెజ్ ఉద్దపాలెం,తాళ్లదిబ్బ గ్రామాలకు చెందిన సుమారు 500 మంది వైసీపీని వీడి జనసేనలో చేరారు.వీరికి ఎమ్మెల్యే జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.జనసేన లో చేరిన వారిలో మాజీ సర్పంచ్ జగ్గారావు మరియు వారి మిత్ర మండలి సభ్యులు ఉన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు దెబ్బతీసినా జగన్, వైకాపా నాయకుల మాటతీరు మారలేదన్నారు. వైకాపా ఖాళీకావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.