

జనం న్యూస్ జులై 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ఆదేశానుసారం..మండలం లోని గోవిందాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ అధ్యక్ష ఎన్నికకు పార్టీ కార్యకర్తలు సమావేశమై క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, శాయంపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి మండలం మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో….గ్రామకమిటీ అధ్యక్షులుగా: నర్ర రాజు,ప్రధాన కార్యదర్శిగా: బూర సత్యనారాయణ
బీసీ సెల్ అధ్యక్షునిగా: బొడ్డు సంతోష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శాయంపేటలో బిఆర్ఎస్ జెండా ఎగురేస్తాం అని తెలిపారు.రానున్న రోజుల్లో మరిన్ని కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి. మొహిబుద్దీన్, కొప్పుల గ్రామశాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్ల, అమ్మ అశోక్, మామిడి శంకర్, గోవిందాపూర్ ముఖ్య నాయకులు సావుల్ల కిష్టయ్య, చింతనిప్పుల భద్రయ్య, ఆకుల లక్ష్మణ్, ఆకుతోట సాంబయ్య, ఆకుతోట రవి, లింగదారి రాజేశ్వరరావు, కల్వాల సతీష్,తదితర నాయకులు పాల్గొన్నారు……