

జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకానుంది. మన విజయనగరం జిల్లాలో నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉచిత ప్రయాణానికి ఉపయోగపడే 190 బస్సులు ఉండగా మరో 20 బస్సులు కావాల్సి ఉందని అధికారులు నివేదిక ఇచ్చారు.మన్యం జిల్లాకు మరో 40 బస్సులు కావాల్సి ఉంది.
పల్లెవెలుగు, అల్హ్రాపల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుంది.