

జనం న్యూస్- జులై 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో మూడు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్న మున్సిపల్ కార్మికులు. నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో తాము ఏ విధంగా జీవించాలంటూ కార్మికుల ఆవేదన. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తున్న తమకు ప్రతిఫలం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. ప్రభుత్వానికి తమకు జీతాలు ఇవ్వండి అంటూ ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న పర్మినెంట్ చేయడం లేదని కార్మికుల ఆవేదన. మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమకు పెండింగ్ ఉన్న మూడు నెలల జీతాలను ఇప్పించాలని మునిసిపల్ సిబ్బంది వేడుకుంటున్నారు.