Listen to this article

జనం న్యూస్ జూలై 28:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామ ప్రధాన రహదారిపై గతంలో చిన్న గుంత పడింది ఆది ఇప్పుడు భారీ వర్షాల కారణంగా పెద్ద గుంతలు ఏర్పడి, రోడ్డు పూర్తిగా నాశనమైంది. ఫలితంగా గ్రామస్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్కూళ్లకు వెళ్లే పిల్లలు, రోజువారీ పనులకు వెళ్లే మహిళలు, వృద్ధులు – అందరూ ఈ ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణిస్తున్నారు.నీరు నిలిచిపోవడంతో రోడ్డు పూర్తిగా కుదేలైంది. వాహనదారులు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. గ్రామ ప్రజలు నిరాశకు గురవుతున్నారు.
ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని, ప్రజల ప్రాణ భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సంబంధిత రోడ్లు-భవనాల శాఖ లేదా పంచాయతీ అధికారుల దృష్టికి పోయిన పట్టించుకోవడం లేదు. అధికారులు ఇప్పటికైనా గ్రామాల పై దృష్టిపెట్టండి అని ప్రజలు కోరుతున్నారు.