Listen to this article

కోరిన కోర్కెలు తీర్చే కొండంత దైవం పశుపతినాథుడు

శ్రావణప్రథమ సోమవారం ప్రత్యేక పూజలు

ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి.

జనం న్యూస్ 28 జులై 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవాలయం (శివాలయంలో) సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం ప్రథమ సోమవారం నాగచతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ పశుపతినాథ్ దేవాలయం (శివాలయంలో) ప్రత్యేక పూజలలో కళాశగనాధిపతి పూజ, శ్రీ పశుపతినాథ్ స్వామికి పంచామృత సహిత రుద్రాభిషేకం, అష్టోత్తరబిల్వార్చన, సాముహిక అర్చనలు నిర్వహించామని ఆలయ అర్చకులు ధూప దీప నైవేద్య అర్చక సంఘం మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి తెలియజేశారు. వల్భాపూర్ ,చుట్టూ పక్కన గ్రామాలలోని ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు,తదనంతరము ఆలయమునకు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ చేసి వేదఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావన ఋషి, సభ్యులు రామారావు, సంపత్ రావు, విజయ్, యాదగిరి,కరుణాకర్,రమణకాంత్, రామకృష్ణ,దశ్రూ,మహేందర్, విజయశ్రీ, రమాదేవి,మంజుల, కావ్య , స్వాతి, వాణి, సరోజన భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.