Listen to this article

జనం న్యూస్ జూలై 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

, ఏ ఊరు ఏంటి వరాలను నేడు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా కొత్తపల్లి ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందు మూడు రోజుల వర్క్ షాప్ ను ఆదర్శ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కనకరాజు ప్రారంభోత్సవం చేశారు. మొదటి రోజు ఆదర్శ విద్యార్ధిని విద్యార్థులచే స్వయంగా తయారు చేసిన చిత్రపటంలను ప్రదర్శించి పర్యావరణా న్ని ఎలా పరిరక్షించాలో తెలియజేశారు, అయ్యో విద్యార్థులచే వక్తృత్వ పోటీలను మరియు మరియు విద్యార్థులచే పాత తరానికి ఆధునికతరానికి చర్చల ద్వారా పర్యావరణంలో ఎటువంటి మార్పులు జరిగినవి తెలియజేశారు. సాయంత్రం ఆదర్శ విద్యార్థులతో ప్రిన్సిపల్ డాక్టర్ త్రినాధరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని వైఫ్ ప్రిన్సిపల్ సుజిని తెలియజేశారు. రెండవ రోజు ఆదర్శ విద్యార్థులతో తయారు చేయబడిన విత్తనబంతులను సూది కొండ ఫారెస్ట్ ప్రఖ్యాత పర్యావరణ పరిరక్షకుడు దుశర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో విత్తన బంతులను ఆదర్శ చైర్మన్ కనకరాజు సెక్రటరీ నాగమణి ఆధ్వర్యంలో అడవిలో వేయడం జరిగిందని కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలియజేశారు. ముఖ్యమైన మూడవ చివరి రోజున ముఖ్య అతిథి తన 72 ఎకరాలను గత 67 సంవత్సరాల నుండి ఒక చిట్టడివిగా తయారుచేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తించిన దుశర్ల సత్యనారాయణ విచ్చేయడం జరిగిందని ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి ఐదుగురు తల్లులు అని వారు భూమి నీరు ఆకాశం నేల అగ్ని వారి పిల్లలే మనమని ప్రకృతికి హానికరమైన పనులు చేయకుండా ఉండాలని అప్పుడే ప్రకృతి మంచి వాతావరణం ఇస్తుందని మరియు ప్రత్యక్ష దేవతలు అయినటువంటి మీ తల్లిదండ్రులను గౌరవించాలని మీరు ఉదయం లేచిన వెంటనే మరియు సాయంత్రం ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మకు పాదాభివందనం చేయాలని, మీ గురించి ఎంతో కష్టపడి తండ్రికి పాదాభివందనం చేయాలని నేను అలాగే చేసి ఎదిగానని ప్రకృతి మీద అభిమానం నాకు నాలుగవ వేట నుంచే కలిగిందని మా అడివిలో ఏ పండు ఏ ఫలాన్ని దేనిని అమ్మ బోనాన్ని, ఏ చెట్టు అయినా దురదృష్టవశాత్తు పడిపోయిన దానిని అక్కడే వదిలేస్తామని కాలగర్భంలో భూమిలో కలుస్తుందని, మరియు అడివి యొక్క నీటి వసతి గురించి ఏడు చెరువులను అవ్వడం జరిగిందని తెలియజేస్తూ ఈ అడవికి ఎదుగుదల నా స్నేహితుల యొక్క పాత్ర ఎంత ఉందని ఈ అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆదర్శకు నన్ను ఆహ్వానించడం ఆదర్శ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ డైరెక్టర్ వజ్రనాథ్ మహర్షి అతిథిగా పాల్గొని విద్యార్థులతో ముచ్చటంచడం జరిగింది. మరొక ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిర్క, రాజమండ్రి డైరెక్టర్ ( ఎన్ ఐ ఆర్ సి ఎ )మాగంటి శేషు మాధవ్ పాల్గొని ఆదర్శ విద్యార్థులకు మా సంస్థలు రీసెర్చ్ విభాగంలో ఇంటర్షిప్ ఇస్తామని తెలియజేశారు. చివరగా మూడు రోజులు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు మాగంటి శేషు మాధవ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది