

. జనం న్యూస్;28 జులై సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
సిద్దిపేట ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఈరోజు శ్రీవాణి సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ, కవి సమ్మేళనం కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు పెందట వెంకటేశ్వర్లు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. తను రచించిన “చెప్పితే సగం ఇవ్వాలి”, “శ్రీ శుభమస్తు” (మంగళ హారతుల సంకలనం) రెండు పుస్తకాలను ముఖ్య అతిథి ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రముఖకవి, సాహితీవేత్త ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ “సాహిత్యం మనిషికి విజ్ఞానం అనే కన్ను వంటిదని”, “పుస్తకం చదివితేనే తలరాత మారుతుందని” రావూరి భరద్వాజ, ఎన్.గోపి, సినారెలు ప్రత్యక్షంగా చూపించినారని తెలిపినారు. ఈ సమావేశంలో బాలసాహితివేత్త పెందోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేను ఇంతవరకు రచించిన పుస్తకాల సంఖ్య 56కు చేరుకోవడానికి “శ్రీ సరస్వతిమాత” (శ్రీవాణి) అనుగ్రహమేనని తెలిపినారు.ఈ సందర్భంగా సమావేశానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన పెందోట వెంకటేశ్వర్లు గురువుగారైన గడ్డం బాలకిషన్ గెజిటెడ్ హెచ్ఎం(రి) జగిత్యాలను ఆవిష్కరించిన పుస్తకాలను గురుదక్షణగా ఇస్తూ తన గురువు గడ్డం బాలకిషన్ ను ఘనంగా సన్మానించి, పెందుట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మూడు పదుల వయసులో ఆరుపదుల వయసు వారికి సార్వత్రిక విద్య స”మాజ” శాస్త్ర అధ్యాపకుడిగా మూడున్నర దశాబ్దాలుగా బోధిస్తూ జ్ఞానవృద్ధులైనారని ప్రశంసించినారు. అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సిద్దిపేట స్టడీసెంటర్ 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరగబోవు మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారు ముఖ్యఅతిథిగా హాజరగు కార్యక్రమానికి కోఆర్డినేటర్ డాక్టర్ యం. శ్రద్ధానందం మరియు మా గురువుగారైన గడ్డం బాలకిషన్ అధికంగా కృషి చేయు చున్నందుకు పెందోట వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపినారు. సన్మానం పొందిన గడ్డం బాలకిషన్ మాట్లాడుతూ బాలకవిత వికాస కృషివలుడు 56 పుస్తకాలు రచించడం గొప్ప చాతుర్యానికి నిదర్శనం, స్ఫూర్తిదాయకం, బాలబంధు పెందోట వెంకటేశ్వర్లుకు పుస్తకావిష్కరణ సందర్భంగా తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా జరిగిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవులు వర్కోలు లక్ష్మయ్య, ఎండి. బాసిత్, సుందరకాండ సత్యనారాయణ, మిట్టపల్లి పరశురాములు, జి. సత్యలక్ష్మి, కరుణ, ఎన్నవెళ్లి రాజమౌళి, అన్నల్ దాసు రాములు, మౌన స్వామి, కే. రాములు, రమేష్ లాల్, రాజయ్య పలువురు పాల్గొని వారి కవితల్ని వినిపించి సభను దిగ్విజయం చేశారు.