Listen to this article

జనం న్యూస్ జూలై 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి మెట్రో పార్క్ వద్ధ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో..ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్, యస్ యన్ డి పి, జి హెచ్ ఎం సి హెచ్ ఎం డి ఏ,అధికారులతో నియోజకవర్గంలోని సమస్యల పై సమీక్షా సమావేశం నిర్వహించారు… ఇందులో ప్రధానంగా నియోజకవర్గంలోని నాళాలు.. డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కొరకై గతంలోని 103 కోట్లు నిధులు కేటాయించామని.. కానీ పనుల్లో ఎందుకు అలసత్వం చూపుతున్నారని అధికారులపై అసహన వ్యక్తం చేశారు.. ముఖ్యంగా రామారావు నగర్ నాల అభివృద్ధి విషయంలో అలాగే భరత్ నగర్ వద్ద నాల నిర్మాణంలో మైసమ్మ చెరువు నుంచి పనులు చేపట్టకపోవడంపై అధికారులను ప్రశ్నించారు… ఫతేనగర్ లోని దీన్ దయాల్ నగర్, జింకలవాడ నాలా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని.. మరియు కేపిహెచ్పి డివిజన్ కల్వరి టెంపుల్ వద్ద పైప్లైన్ నిర్మాణం డ్రైనేజ్ అభివృద్ధి కొరకు కూడా నిధులు కేటాయించినా పనుల్లో అలసత్వం వహిస్తున్నారని అన్నారు.. కేపిహెచ్బి డివిజన్లో పెరుగుతున్న హాస్టల్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుందని.. కె పి.హెచ్.బి లో ముఖ్యంగా హాస్టల్స్ వల్ల సమస్య తలెత్తుతుంది..1800 హాస్టల్స్ ఉన్నాయి..ఎలాంటి పర్మిషన్ లేవు…టౌన్ ప్లానింగ్ వాళ్ళు విచ్చల విడిగా పర్మిషన్లు ఇస్తున్నారు.. కాంట్రాక్టర్ లు జాప్యం వహిస్తున్నారు వారికి నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు…బ్లాక్ లిస్ట్ లో పెట్టండి…అధికారులు ఏదైనా వర్క్ స్టార్ట్ అయ్యే ముందు సమాచారం ఉండదు.. కార్పొరేటర్ల కు గౌరవం లేదు.. కూకట్ పల్లి కి ఫండ్ విషయంలో లో అన్యాయం జరింగింది.పక్క నియోజక వర్గంలో మంచి రోడ్లు తవ్వి రోడ్లు వేస్తున్నారు అని ఆరోపించారు… బాలనగర్ డివిజన్ ఇందిరానగర్ ,శ్రీశ్రీ నగర్ లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.. ఎక్కడికక్కడ వీధి దీపాలు పునరుద్ధరించాలని తెలిపారు…గత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ దాదాపు యనబై శాతం పూర్తి చేసుకున్నామని అలాగే వాటర్ వర్క్స్ పనులు తొంబై శాతం పూర్తి చేసుకున్నామని ఆనాడు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోబట్టే ఈరోజు నాడు నియోజకవర్గంలో కొంత మేర అయిన ఊపిరి పీల్చుకోగలుగుతున్నామని అన్నారు… ఎక్కడైనా నిధులు ఇబ్బంది ఉంటే తమకు తెలియజేయాలని నిధులు విడుదలైనా కూడా పనులు చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజ్ ,నాలాల విషయంలో అలసత్వం వహించవద్దని..అలాగే నూతనంగా మంజూరు అయిన పనులకు త్వరగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభం అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని పనులు త్వరగా పూర్తిచేసి తదుపరి సమావేశానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దాం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, సభిహ గౌసుద్దీన్, మందడి శ్రీనివాసరావు ,పగుడాల శిరీష బాబురావు,మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్…మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ , పగడాల బాబురావు , మరియు ఇంజనీరింగ్ ,వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ, యస్ యస్ డి పి,జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు…