Listen to this article
  • ఓటు చైతన్యం కోసం బ్యాగులపై ముద్రించి పంపిణి చేసిన ప్రేమ్ టైలర్ మణ్యం

జనం న్యూస్ జనవరి 28 ( వనపర్తి జిల్లా పానగల్ మండల ప్రతినిధి కల్మూరి వెంకటేష్ )
వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ లో వున్న ప్రేమ్ టైలర్ మణ్యంజనవరి 25 ఓటు దినోత్సవం పురస్కరించుకు ఓటర్ల చైతన్యం కోసం ఓటుకు సంబంధించిన చిత్రపటాన్ని బ్యాగులపై ముద్రించి ఓటర్లకు ప్రచార నిమిత్తం పంచే ఉద్దేశంతో జనవరి 25 ఈరోజున ఓటు పై అవగాహన కల్పించుటకు బ్యాగులపై ముద్రించారు ఇట్టి బ్యాగులను వెనుకబడిన కులాల సమాఖ్య బి సి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ ఆవిష్కరించారు అనంతరం చెన్నరాములు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులు ఓటును నమోదు చేసుకొని తప్పనిసరిగా ఎన్నికల సమయంలో తమ ఓటును వినియోగించుకోవాలని , ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని ఓటును డబ్బులకు,మద్యానికి అమ్ముకోకుండా నైతిక విలువలకు కట్టుబడి నిజాయితీగా పనిచేసే అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని మన ప్రాంతాల అభివృద్ధి కి పాటుపడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రజలు ప్రతినిత్యం తమ అవసరాల కోసం ప్లాస్టిక్ బ్యాగులను వినియోగించడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని దీనిని నివారించే ఉద్దేశంతో ప్రేమ్ టైలర్ నానమోని మన్నెం సామాజిక చైతన్యం కోసం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు, ఈ కార్యక్రమంలో ప్రేమ టైలర్ నానమోని మన్యం,బి సి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తోట బాలరాజు , బి సి ఎఫ్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు శూగూరు శ్రీనివాస్ సాగర్ మరియు వనపర్తి పట్టణ బీసీఎఫ్ అధ్యక్షులు ఉందేకోటి ఆంజి తదితరులు పాల్గొన్నారు.