

జనం న్యూస్. జులై 29 చిన్నగొట్టిగల్లు మండలలో ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుబెల్లంకొండ మురళీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ మీట్లో పలువురు విలేకరుల సమీక్షంలో మాట్లాడుతూ
మాజీ డిసిఎంఎస్ ఛైర్మన్, వైసీపీ నేత సహదేవ రెడ్డి తీరుపై మండిపాటు పడుతూ టీడీపీ నేతలపై సహదేవ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని వైసిపి హయంలో టీడీపీ కార్యకర్త బాలిరెడ్డి భరత్ రెడ్డిపై దాడి చేయించింది మీరే నని ఇంకా భాకరాపేటలో సాకిరి భూపాల్ మామిడి చెట్లు నరికివేశారని సహదేవ రెడ్డి పలు రకాల ఆరోపణలు మాపై గుప్పించారని ఇది ముమ్మాటికీ అవాస్తమని ఇతరుల భూములు ఆక్రమించి చెట్లు నాటితే, రైతులే కూల్చేశారు అని మారసానివారి పల్లెలో పురుషోత్తం రెడ్డి చింతచెట్టు నరికేసారన్నారు. అది వేరే వారిభూమిలో ఉన్న చెట్టును రెవెన్యూ అనుమతులతో, కోర్టు ఉత్తర్వులు మేరకు తొలగించారు. అంతేగాని ఇంకా వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, అతని కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడి
మొబైల్, బంగారం, పనిముట్లు దోచుకు వెళ్ళింది మీ హయాంలోని ఇంకా ఇలాంటి సంఘటనని మీరు చేసి మాపై బురద చల్లి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు దీన్ దార్లపల్లి పంచాయతీలో దొనకొండ సుబ్రమణ్యం పై దాడి చేశారనినని పచ్చ మీడియాలో పిచ్చి రాతలు రాయించాడు. అంతేకాక మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దారి కోసం కొక్కింటి శంకరయ్య పై దాడి చేసింది ఎవరు?దారి సమస్యతో పరస్పరం దాడులు చేసుకుంటే టీడీపీకి అంటగడుతారా..?
మట్లువారిపల్లెలో 25మంది రైతు కుటుంబాలు వెళ్లే మార్గాన్ని రిటైర్డ్ లెక్చరర్ కంచె వేసి అడ్డంకులు సృష్టించారు ఆ దారి కూడా ప్రభుత్వం భూమిలోనే ఉంది ఎస్ఐ సమస్య పరిష్కారానికి వెళ్లితే దౌర్జన్యం చేశాడని అసత్య ఆరోపణలు చేశారు
పై అంశాలన్నింటినీ సాక్ష్యాధారాలతో నిరూపించేందుకు సిద్దం
మీకు దమ్ము, ధైర్యం ఉంటే పై అంశాలపై చర్చకు రావాలి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఎలాంటి రౌడీయిజాన్ని, దౌర్జన్యాలను ప్రోత్సహించరు. అని. పలువురు తెలుగుదేశం మండల నాయకుల ఆధ్వర్యంలో చెప్పారు ఈ కార్యక్రమంలో కొట్టే శివకుమార్, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం తదితర మండల తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.రౌడీయిజం చేస్తే నిర్మొహమాటంగా కార్యక్రమాలకు రావద్దని ఎమ్మెల్యే నాని గారు సూచిస్తున్నారు