

జనం న్యూస్ జులై 30
చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం చిలిపిచెడు మండలం శీలం పల్లి రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి తాసిల్దార్ సంబంధిత అధికారులతో హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఅర్హులైనవారందరికి రేషన్ కార్డులు ఇచ్చే వరకు ఇది కొనసాగుతుందని తెలిపారు..సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం అందించి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించి, మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ప్రభుత్వ దృడ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో కార్యక్రమాలు, అభివృధ్ధి పనులు చేపడుతున్నదని ఆన్నారు. రేషన్ కార్డులలో పేర్లు నమోదు కాని వారు నమోదు చేయించుకోవాలని, రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆన్నారు. ఎవరైనా చనిపోయిన లేదా రేషన్ కార్డులలో పేర్లు తప్పుగా నమోధై ఉంటే స్వచ్చందంగా వారి పేర్లు తీసివేయించాలని కోరారు.నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రేషన్ కార్డుల వల్ల అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారని, అంతేగాక సన్నబియ్యం పొందుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని, ప్రభుత్వాలు అందించే పథకాలు లబ్ది దారులకు అందజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు