

జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (AMC) పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుతూ, వారి సేవల ద్వారా రైతులకు గుణాత్మకంగా మద్దతు అందించాలని ఆమె పిలుపునిచ్చారు. వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తోడ్పాటుతో పనిచేయాలని, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, AMC అధికారులు, కూటమి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.