Listen to this article

జనం న్యూస్ జూలై 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఉన్నత అధికారులు సింగపూర్ పర్యటనలో 26 కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చల జరిపి, సింగపూర్ లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యాయం చేశారని పెట్టుబడులు ఆకర్షణ, ఏపీ బ్రాండ్ పెంచడమే లక్ష్యంగా సింగపూర్ పర్యటన విజయవంతం కావడం వారి కృషి వర్ణానాతీతమరని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు కొనియాడారు. పట్టణాభివృద్ధి ఐ టి, ఏఐ, పిన్ టెక్, మారిటన్ పోర్టులు మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని, సింగపూర్ పారిశ్రామికవేత్తలను కోరడం వర్ణానాతీతం నాగ జగదీష్ అన్నారు. సింగపూర్ లోని ప్రతిష్టాత్మక హౌసింగ్, బిడదారి హౌసింగ్, జురాంగ్ పెట్రోల్ కెమికల్ హాయ్ ల్యాండ్, తువ్వ పోర్టు, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్స్ ను ముఖ్యమంత్రి సందర్శించి, వాటి అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలతో అధ్యాయం చేశారని నాగ జగదీష్ అన్నారు. నాటి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగపూర్ కన్షియంతో ఒప్పందాలు చేసుకున్న అమరావతి నిర్మాణంలో వారి భాగస్వామ్యానికి 300 కోట్లు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్రానికి ఆర్థిక నష్టం కలిగించారని, సింగపూర్ ఆంధ్రప్రదేశ్ సంబంధాలను పునరుద్ధరించడానికి చంద్రబాబు లోకేష్ ఉన్నతాధికారులు కృషి ప్రశంసనీయం అని నాగ జగదీష్ అన్నారు. ఈ పర్యటన వల్ల ఉత్తరాంధ్ర విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పోర్టులు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం సహకరిస్తుందని నాగ జగదీష్ అన్నారు.//