

జనం న్యూస్ జూలై 31 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో ఇక వచ్చేది బీసీల రాజ్యమే
బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక
రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోదారి శ్రీను ఎన్నిక
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక ఉద్యమం లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాలేదని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం వరకు కవులు కళాకారులు రచయితలు సాంస్కృతిక సేనగా ఏర్పడి ఉద్యమిస్తేనే ఉద్యమాలు విజయం సాధించాయని, ఇప్పుడు తెలంగాణలో జరిగే బీసీల రాజకీయ పోరాటానికి సాంస్కృతిక ఉద్యమం తోడు అయితే ఇక వచ్చేది బీసీల రాజ్యమేనని ఇది ఎవరు ఆపలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కవులు కళాకారులు తరలివచ్చి బిసి కల్చరల్ ఫోరం వేదికను ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలోని బీసీ కళాకారులు కవులు సామాజిక దోపిడీ అసమాన తలపై, అలాగే ప్రాంతీయ వివక్ష పై తమ కలం ద్వారా, గలం ద్వారా పోరాడారని దీనితో తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యంతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కూడా జరిగిందని, ఇప్పుడు తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై, అలాగే బీసీలకు రాజకీయ అధికారం కి కవులు కళాకారులు తమ కళాలను గలాలను ఓటు ఓటు చైతన్యంతో బీసీలను రాజకీయ చైతన్యంగా మార్చి రేపటి బీసీల రాజకీయ అధికారానికి బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు బీసీ కవులు కళాకారులు అంతా ఏకధాటిగా ముందుకు వచ్చి పార్టీ జెండాలను, ఎజెండాలను పక్కకు పెట్టి బీసీల భావజాల వ్యాప్తినీ పల్లె పల్లెకు తీసుకెళ్లి బీసీ ఉద్యమ చరిత్రను తిరగరాయాలని, బీసీల రాజకీయ పోరాటంలో కోట్లాదిమందిని భాగస్వామ్యం చేయాలని కళాకారులకు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్ కుమార్ మాట్లాడుతూ బీసీ కళాకారులు ఏకం కావడం చాలా అభినందనీయమని, దేశ వ్యాప్తంగా కూడా బీసీల వాణి బలంగా వినపడుతున్న ఈ క్రమంలో దీనికి తోడు బీసీ కళాకారులు ఒక్కటే తమ రచనల ద్వారా పాటల ద్వారా ధూంధాంల ద్వారా బీసీల రాజకీయ చైతన్యాన్ని రగిలించాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక బీసీ బిడ్డగా ఈ సమావేశానికి హాజరయ్యానని బీసీల ఐక్యత కోసం కళాకారులు కృషి చేస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, దేశంలో రాష్ట్రంలో బీసీలకు మంచి రోజులు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు బీసీల ఐక్యతకు తనవంతుగా కృషి చేస్తూ బీసీ రిజర్వేషన్ల ఆమోదానికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గం ను ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు
రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న,రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా కోదారి శ్రీను,ఉపాధ్యక్షులు గా -అభినయ శ్రీనివాస్,అంబటి వెంకన్న,కోశాధికారిగా
బీసీ రామలింగం,సంయుక్త కార్యదర్శిలుగా మళ్లీక్ తేజ,బుర్ర సతీష్,ప్రకాష్,ప్రచార కార్యదర్శిలుగా..
పొద్దు పోడుపు శంకర్, రాచకొండ రమేష్,రాచకొండ రంగన్న,సాంస్కృతిక కార్యదర్శిలుగా వడ్లకొండ అనిల్,
జడల రమేష్,జీ వై కృష్ణసహాయ కార్యదర్శిలుగా మధుప్రియ,మామిళ్ళ మౌనిక,పరకాల అజయ్,సిద్దిపేట శ్రీనివాస్,ఐల నరసింహ స్వామి,సలహా దారులుగా మోహన్ బైరాగి, ఐలా నరసింహ చారి,సిద్దిపేట శ్రీనివాస్,
ఒగ్గు రవి,జనగామ సోమేశ్వర్, చారీ,యోచన,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నక్క శ్రీకాంత్,రాంసాగర్ లక్ష్మణ్,
ముకుంద,పద్మావతి,సంస్కృతిక కార్యదర్శిలుగా- స్వామి డప్పు, సంబరాల బాలు,కందుకూరి బ్రహ్మ చారీ,
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సమావేశంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, శేఖర్ సగర, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్ గౌడ్, శ్యాం కుర్మా, తారకేశ్వరి, సుజాత, తదితరులు పాల్గొన్నారు
