

జనం న్యూస్ జులై 31 వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి గ్రామాని కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కక్కులూరి శ్రీనివాస్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఎజెన్సీ) పరిగి నియోజకవర్గ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. పరిగి పట్టణంలోని ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో ATMA (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) పరిగి ఆత్మ కమిటీ చైర్మన్‌గా కక్కులూరి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి గారిని మరియు పాలకవర్గ కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం సభ్యులను ఎమ్మెల్యే అభినందిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , వ్యవసాయ శాఖ అధికారులు, వికారాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు షకిల్ భాయ్, వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి పెంటయ్య, శ్రీనివాస్, అజీమ్ పటేల్, రఘునాథ్ రెడ్డి, పి సతీష్ రెడ్డి, పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, వివిధ గ్రామాల సర్పంచులు సీనియర్ నాయకులు యువజన నాయకులు పాల్గొన్నారు.
