Listen to this article

జనంన్యూస్. 31.నిజామాబాదు. టౌన్.

నిజామాబాదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిసిన నాటి నుండి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించి ఏళ్ల తరబడి విద్యార్థులు డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఎమ్మెల్యే గత అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసేకెళ్లడం జరిగింది.ఎమ్మెల్యే కృషి వల్ల నేడు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల నాలుగు కోర్సులతో మంజూరు చేసినట్లు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు అసెంబ్లీలో ప్రస్థావించిన అంశానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.