Listen to this article

బిచ్కుంద జులై 31 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కుక్కల బెడద వాటి సమస్య తీర్చాలని మున్సిపల్ అధికారికి భారతీయ జనతా పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విష్ణు మాట్లాడుతూ బిచ్కుందలో కుక్కలు గుంపులు గుంపులుగా పంచరిస్తున్నాయని వాహనదారులు పైన, ప్రజల పైన దాడికి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బస్టాండ్ నుండి కోర్టు వరకు రోడ్డుపై నిలబడి ద్విచక్ర వాహనదాలను వెంబడిస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు కుక్కల బెడదను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జాదవ్ పండరి, ఎలక్షన్ ఇంచార్జ్ దన్నూరు విట్టల్, గణపతి మహరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లు దేశాయ్, గోపాల చారి, ఫష్కే ప్రకాష్, బుడాల గంగరాజ్, మొగులు గొండ బండారెంజల్ సాయిలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.