

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య
జనం న్యూస్, జూలై 31 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచరం కనకయ్య విమర్శించారు.ఓవైపు బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపడం ద్వారా బీసీలను మోసగిస్తోందన్నారు.గురువారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధాచారం కనకయ్య మాట్లాడారు. ఒకే అంశంపై బీసీ బిల్లు పెండింగులో ఉండగా, ఆర్డినెన్స్కు ఆమోదం సాధ్యం కాదనే విషయం అందరికీ తెలుసన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, రిజర్వేషన్ల పెంపును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చితేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలన్నదే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు అని నిత్యం ఎరువుల దుకాణాల వద్ద పడికాపులు కాస్తున్నారని అన్నారు, యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారని ఒక బస్తా కోసం గంటల తరబడి వేచి ఉండవలసిన దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది అని ఆయన పేర్కొన్నారు.లిక్కర్ మీద ఉన్న శ్రద్ధ పాఠశాలలపై లేదని మండీపడ్డారు ,
గ్రామాలలో మద్యం ఏరులై పారించడమేనా ప్రజా పాలన అంటూ ప్రశ్నించారు, ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న పాపాన పోలేదని పాఠశాలలో అనేక సమస్యలు రాజ్యం వెళుతున్నాయనీ అన్నారు. గ్రత
బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతే రాజు అనే విధంగా మాజీ సీఎం కేసీఆర్ రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ అని కొనియాడారు.అదే కాంగ్రెస్ హయాంలో రైతులు రోడ్లెక్కిన పరిస్థితి నెలకొంది అని చెప్పారు,కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు,ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రాజు గౌడ్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీను, మండల యూత్ విభాగం అధ్యక్షులు కబడ్డీ బాలకృష్ణ, షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.