

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట సుబ్బయ్య తోట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న దత్త సాయి సన్నిధిలో ఈరోజు శ్రావణమాసం మొదటి గురువారం పురస్కరించుకొని దత్త సాయి కి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, దత్త సాయి సన్నిధి నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ దత్త సాయి సన్నిధిలో జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు పరమ పవిత్రమైన శ్రావణమాసం శ్రావణమాసానికి అధిష్టాన గ్రహం చంద్రుడు, ఎవరైతే ఈ మాసంలో అన్న సంతర్పణ చేస్తారు వారికి చంద్రగ్రహ దోషాలు తొలగి సద్గురు ఆశీస్సులతో అనుకున్న కార్యక్రమాలు అన్ని సిద్ధిస్తాయని తెలిపారు ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలయ్యా అనే శ్రీ దత్త సాయి సుత్తిని ఆచరిస్తూ దాతల సహకారంతో ఆకలితో వచ్చే పేదలకు సాధువులకు భక్తులకు అన్నసంతర్పణ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు