Listen to this article

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే.

జనం న్యూస్.జులై 31కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నూతన, కుటుంబ సభ్యుల చేర్పులతో రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండలాధికారి లోకేశ్వర్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ లతో కలిసి హాజరై లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, వివాహం అయినవారు, పిల్లల పేర్లను రేషన్ కార్డులలో నమోదు కొరకు మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకున్నట్లయితే తహసిల్దార్, సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జైనూర్ మండలానికి 913 నూతన రేషన్ కార్డులు, 1 వేయి 595 మంది సభ్యుల పేర్లు రేషన్ కార్డులలో నమోదు చేసి రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం చౌక ధరల దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తుందని, లబ్ధిదారులు సన్నబియ్యంను సద్వినియోగం చేసుకోవాలని, సన్న బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరడంలో రేషన్ కార్డులే ప్రామాణికంగా నిలుస్తాయని తెలిపారు.అనంతరం జైనూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో చేయూత పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సందర్శించారు. తపాల శాఖ ద్వారా పింఛన్ పంపిణీ చేపడుతున్నందున పింఛన్దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వృద్ధాప్య పింఛనుదారులకు నీడ, త్రాగునీటి వసతి కల్పించాలని, తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అడా బిర్మావ్, సహాయ పౌరసరఫరాల శాఖ అధికారి సాదక్, రెవెన్యూ సిబ్బంది, డి. పి. ఎం. శేష రా, పంచాయితీ కార్యదర్శి, తపాలా సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.