Listen to this article

జనం న్యూస్ జూలై 31 కాట్రేనికోన, జనం న్యూస్

బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్రలు పడక పోవడంతో పింఛన్‌ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కాట్రేనికోన ఎంపిడిఓ ఎస్ వెంకట చలం తెలిపారు,ఇక నుంచి ముఖ గుర్తింపు ద్వారా పింఛన్‌ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.ఆగస్టు నెల నుంచే ఈ కొత్త విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు కాట్రేనికోన మండల పరిధిలోని 10వేలు 251 మందికి 4 కోట్ల 46 లక్షల యాభై రెండు వేల 500 రూపాయలను విడుదల చేశామన్నారు,వృద్దులు,ఒంటరి,మహిళలు,వితంతువులు,దివ్యాంగులు,చేనేత,గీత,కార్మికులు,పైలేరియా,హెచ్‌ఐవీ,డయాలిసిస్‌ బాధితులకు పింఛన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే,ఇందులో భాగంగా లబ్ధిదారుల ఫొటోలు తీసి,ఆధార్‌లో ఉన్న ఫొటోలతో సరిపోల్చి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.అనంతరం వారికి పింఛన్‌ డబ్బులను చెల్లిస్తారన్నారు,గురువారం ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శిలు పింఛన్ నగదును బ్యాంక్ నుండి తీసుకుని ఆయా సచివాలయం సిబ్బందికి అందజేశారు,ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు