Listen to this article

జనం న్యూస్ జులై 31 నడిగూడెం

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసినప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అన్నారు. గురువారం పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన భూపతి సత్యనారాయణ గురువారం పదవీ విరమణ చేయటంతో పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తన విధి నిర్వహణలో ఎవరిని నొప్పించకుండా పనిచేసుకుంటూ పాఠశాల అభివృద్ధికి సహకరించే వారని,ఉపాధ్యాయులు విద్యార్థులతో కలివిడిగా ఉండే వారని, వారు పదవీ విరమణ పాఠశాలలో విడిచి వెళ్లడం ఎంతో బాధగా ఉందన్నారు. వారి శేష జీవితాన్ని సమాజ సేవకు ఉపయోగించాలని,వారు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత మాట్లాడుతూ నేను పని చేసిన కాలంలో నాకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు సామినేని శ్రీనివాసరావు,కత్తి వెంకటేశ్వర్లు, బత్తిని శ్రీనివాసరావు, వేపూరి పర్వతాలు, పాతకోట్ల లలిత, సిఆర్పి రామారావు, పాఠశాల సిబ్బంది ఏం సత్యనారాయణ, తూము వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.