

జనం న్యూస్ జులై 31 నడిగూడెం
మండల పరిధిలోని కాగితరామచంద్రాపురంలో గురువారం ఉచిత టీబీ (క్షయ) వ్యాధి, ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. సూపర్వైజర్ విజయకుమార్ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీ నోడల్ అధికారి కృష్ణమూర్తి, MLHP మహేశ్వరి, ఏఎన్ఎం రమాదేవి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.