Listen to this article

పోలీసుల‌ను అభినందించిన- సీపీ సాయి చైతన్య

జనం న్యూస్, జూలై 31 –

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన భూక్యా వినయ్ (21)కు మూడేళ్ల సాధారణ జైలు శిక్షను జిల్లా మేజిస్ట్రేట్ గురువారం విధించారు.ఈ విషయాన్ని ఏర్గట్ల ఎస్‌ఐ పడాల రాజేశ్వర్ తెలిపారు.ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం 2020సంవత్సరములో బట్టాపూర్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి బాలిక ఆడుకుంటూ ఉండగా, భూక్యా వినయ్ మాయమాటలు చెప్పి బాలిక ను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే పోక్సో చట్టం (POCSO Act) మరియు అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు వినయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి, మేజిస్ట్రేట్ ఎదుట సాక్ష్యాధారాలు సమర్పించారు. వీటిని పరిశీలించిన జిల్లా మేజిస్ట్రేట్ భూక్యా వినయ్‌కు మూడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించారు.ఈ కేసులో న్యాయం జరగేందుకు కృషి చేసిన భీంగల్ సీఐ సత్యనారాయణ, ఏర్గట్ల ఎస్‌ఐ పడాల రాజేశ్వర్, కోర్టు కానిస్టేబుల్ తిరుమలేష్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.