

జనం న్యూస్. ఆగష్టు 1
హైదరాబాద్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అధ్యక్షతన ఉసా ఐదవ వర్ధంతి సభను హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ సేఫ్ ఫౌండేషన్ &దళిత మహిళా సమిష్టి విద్య పరిశోదన శిక్షణ కంప్యూటర్ అక్షరాస్యత అభ్యాస కేంద్రంలో ఉ.సా శిష్యులు సహచరులు ఘణంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొ.సూరేపల్లి సుజాత గారు మాట్లాడుతూ:- తఃడ్రి సమానులైన ఉ.సా కరోనాతో మనకు దూరమవడం తానొక ప్రీయమైన గురువును కోల్ఫోయానని , ఉ.సా ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాల్సిఉండెనని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన లేక పోవటం సమాజానికి తీరని లోటని తెలిపింది.ఉ.సా కంచులా మోగీ ఉపన్యాసం, అనితర సాధ్యం కానీ విశ్లేషణ, ఆయన ఆశయాలు, ఐడియాలజీ, దేశీయ ప్రాపంచిక దృక్పథం అన్నీ మన మధ్య సజీవంగా ఉన్నాయని. ఉ.సా ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళులని అన్నారు. సజయ మాట్లాడుతూ సాహిత్యం ,పత్రికలను నడుపడం, యూట్యూబ్ చానల్ ద్వారా వెంట వెంటనే సమాజానికి సరైన మెసేజ్ ను అందించే ఉ.సా లేని లోటు కనపడుతున్నదంటూ, ఉ.సా నిజమైన పేదల ప్రజల పక్షపాతి అంటూ ముఖ్యంగా మహిళా పక్షపాతి అని నొక్కిచెప్పారు. ఓపిడిఆర్ రాష్ట్ర అద్యక్షురాలు న్యాయవాది లక్ష్మీదేవి మాట్లాడుతూ ఉ.సా చాలా పట్టుదల గల కామ్రేడ్ అని ఆయన ప్రతీ ఆర్థిక రాజకీయ,వివిధ రంగాల ప్రజల ముఖ్యంగా దళితుల,మహిళల సమస్యపై అందరికంటె ముందుగా స్పందించి వెంటనే ఫీల్డుమీదకు తీసుకు వెళ్ళేవారని, సంబందితా ఖర్చులన్నీ కూడా తానే స్వయంగా బరించేవారంటూ ఆయన నిజమైన ఉద్యమాల ఉపాద్యాయుడని ఆయన సేవలను కొనయాడిందీ. గడ్డం సదానందం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ ఉ.సా కమ్యూనిస్టు విప్లవ కారుడిగా అనేక ప్రజా సమస్యలపై, ముఖ్యంగామోత్కూర్ ప్రాంతంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేసారని కరెంట్, సాగునీటి సమస్యలపై కోసం వేలాదిగా కదిలించి ఎడ్లబండ్లతో జరిపిన ప్రజా ఆందోళనకు ప్రభత్వం దిగివచ్చిందని గుర్తుచేశారు. చుట్టుప్రక్కల గ్రామాలన్నింటా ఉ.సా సుపరిచితుడని తమ ప్రియతమ ఉద్యమ నేతను కోల్పో యమనీ ఉ.సా తమ కోసం చేసిన పోరాటాలనూ కొనయాడుతూ అక్కడి ప్రజలు పుల్లాయి గూడెంలో స్మారక స్థూపం ను ఏర్పరచు కొన్నారనీ అది ప్రజల ప్రేమకు నిదర్శానమని అన్నారు. నక్సల్బరీ స్రవంతి రివిజనిజంతో పాటు బ్రాహ్మణిజంతో పోరాడి నంత సీరియస్ గా పోరాడక పోవడం వలననే నేటికీ కులం సమస్య అలానే ఉందని ఉ.సా. చెప్పే వారని గుర్తు చేసారు. నేడు మనం ముస్లీంలను, క్రైస్థవులను దళితులను తగినంతగా కలుపుకు పోలేక పోతున్నా మన్నామని చెపుతూ ఉండే వారని అన్నారు. కలుపుక పోవడం అనేది వర్గపోరాటం నుండి ప్రక్కకు పోవటం కాదనే విషయాన్ని మొదట గుర్తించా లని, దళితుల మీద జరిగే దాడులకు ఒక వ్యూహం ఉందని అది అవర్ణ వ్యతిరేక సవర్ణ వ్యూహంలో భాగమేనంటూ ఈ దేశంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపి ఆర్ఎస్ఎస్ హిందూ ఫాసిజంను నెలకొల్పుతున్నాయని వివరించే వారని గుర్తుచేశారు. హిందు ఫాసిజాన్ని ఓడించాలంటే మొదట సామాజికంగా సవర్ణ ఫాసిజాన్ని ఓడించాలని తెలిపేవారని, అంబేద్కర్ మహ నీయుడు టూ ట్రాన్స్ఫర్ ది ఇండియన్ సొసైటీ ఈ సామాజిక వ్యవస్థను సామాజిక పరివర్తనలోకి తీసుకు రావాలని ఏనాడో చెప్పాడని తెలిపిన ఉ.సా మన నుండి దూరమై అప్పుడే అయిదేండ్లు అయ్యాయని ఆవేదన వ్యక్తం కొత్తగట్టు మల్లన్నమాట్లాడుతూ ఉద్యమాల ఉపాధ్యా యుడైన ఉ.సా దేశంలో ఉన్న కుల వ్యవస్థను ఎత్తిచూపి, దానిని తుది ముట్టించందే విప్లవం విజయవంతం కాదని స్పష్టంగా చెప్పారని అన్నారు. అందుకు తగిన సిద్ధాంతాన్ని, కార్యచరణ ను ఎన్నుకొని పనిచేస్తున్న క్రమంలో ఎన్నో ఆటు పోటులను, అవమానాలను ఎదుర్కొన్నారని తెలిపారు.. ఉ.సా ఒక లెజెండ్ అని కీర్తించారు. ఉ.సా కమ్యూనిస్టు విప్లవకారుల కుల-వర్గ జమిలి పోరాట సిద్ధాంత కర్త ఆర్గానిక్ ఇంటలెక్సు వల్, సోషల్ యాక్టివిస్ట్, మార్క్స్ పూలే అంబేడ్కర్ సిద్ధాంతాలను కల గలిపిన విప్లవ మేధావని పేర్కొన్నారు. అందుకే ఉ.సా ను ఇండియన్ గ్రాంసీ అంటారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ మహాసభ అద్యక్షులు కొత్తగట్టు మల్లన్న, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గడ్డం సదానందం, ఓపిడిఆర్ రాష్ట్ర అద్యక్షురాలు న్యాయవాది లక్ష్మీదేవి,స్వతంత్ర జర్లిస్టు సజయ, స్థానిక సిపిఐనాయకులు, కాసీం,ఉప్పల్ మౌలా న, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.మొదట ఉ సా చిత్ర పటాన్ని పూల మాలలతో అలంక రించి ఉద్యమ జోహార్లు అర్పించారు….