Listen to this article

జనం న్యూస్ జనవరి 27 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా నుఅభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు .అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి సంక్షేమ ఫలం అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు.అందుకు జిల్లా అధికారులు చేస్తున్న కృషికి ఆమె అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజే ప్రకటించిన విధంగా ప్రజాపాలన సాగించేందుకు తమ అధికార యంత్రంతో కలిసి ఛాయ శక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ సంవత్సరం జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 35 ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులను ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయము అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద జిల్లాలో 27417 మంది లబ్ధిదారులను గుర్తించామని వారికి ఒక్కొక్కరికి 12000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.రైతు భరోసా పథకం కింద 72,500 మంది రైతులకు 12000 చొప్పున పంట పెట్టుబడి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మరియు నిర్మల్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.