Listen to this article

జనం న్యూస్- ఆగస్టు 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

తెలంగాణ విద్యా వికాస వేదిక కన్వీనర్, గ్రంథాలయోద్యమ ప్రచారకులు విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానవీయ సాహిత్య సాంస్కృతిక విలువల్ని పుస్తక పఠానాన్ని పెంచడానికి బడి బీరువాల్లో ఉన్న పుస్తకాలను బయటకు తీసి నిరంతరం చదివించడం ద్వారా వాళ్లలో ప్రశ్నించే స్వభావాన్ని పెంచాలని అన్నారు. విద్యార్థుల పెరుగుతున్న అపసవ్య అనేతిక హింసాత్మక ధోరణులు అద్భుతమైన కథల ద్వారా చదివించడం చెప్పడం పరిచయం చేయడం ద్వారా వాళ్లలో మానవీయ నైతిక విలువలని పెంపొందించవచ్చని, అందుకోసం ప్రతి పాఠశాల నిరంతరం పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదివించాలన్నరు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇప్పుడు అన్ని పాఠశాలలు దాదాపు ఇంగ్లీష్ మీడియం లో ఉండడం వలన తెలుగు భాషలో వెనుకబడుతున్నారని గ్రంథాలయాల ద్వారా వారిలో తెలుగు భాష పట్ల అభిరుచి ఆసక్తి కలిగించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ శ్రీ నరేందర్ రెడ్డి, దూదియా నాయక్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.