

- స్కూల్ లో ఉల్టాపల్ట జెండా ఆవిష్కరణ
జనం న్యూస్/జనవరి 28/కొల్లాపూర్
76 వ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం రాజపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండాను ఆదివారం ప్రధానోపాధ్యాయులు ఏం.అలివేలమ్మ తలకిందులుగా ఎగురవేసి జాతీయ జెండాను అవమానించారు.వెంటనే గమనించిన సాటి ఉపాధ్యాయులు మళ్ళీ సరి చేశారు.జాతీయ జెండాపైఅవగాహన లేకనా..?లేక ఆయిష్టతతోనా..? అని గ్రామ ప్రజలు ప్రశ్నించి మండిపడ్డారు.ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈ విషయంపై నాగర్ కర్నూల్ డిఈఓ రమేష్ కుమార్ నీ వివరణ అడగగా ఫ్లాగ్ కోడ్ ప్రకారం హెచ్ఎం పై ఎంక్వయిరీ కండక్ట్ చేశామని తెలిపారు.