Listen to this article

జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడారం ప్రతినిధి గ్రంధి నానాజీ


కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయతీ గండి గాని చెరువు గ్రామంలో శ్రీ రామాలయం వద్ద సమరసత సేవా ఫౌండేషన్ గ్రామ మహిళా కన్వీనర్ బొంతు నాగలక్ష్మి ఆధ్వర్యంలో ధార్మిక జట్టు సభ్యులు మాతృమూర్తులు శ్రావణ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ వరలక్ష్మీ వ్రత మహత్యము వివరిస్తూ మనమందరము రామాయణము భగవద్గీత అందరూ తెలుసుకోవడం వలన మనిషి తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలి సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి సద్భావనలు కలుగుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో బొక్కా ఈశ్వరి మట్టపర్తి పార్వతీదేవి యనమదల దేవి మట్టపర్తి పద్మశ్రీ సంసానీ గంగాభవాని సంసానీ జానికమ్మ బి. రామారావు గుత్తుల త్రిమూర్తులు వల్లీ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.