Listen to this article

జుక్కల్ ఆగస్టు 01 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామంలో సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ (NMEO) పథకం కింద DSB34 రకం సోయాబీన్ విత్తనాలు రైతులకు సరఫరా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్ద శక్కర్గ గ్రామంలో క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించి రైతులకు సోయాబీన్ పంటల మీద ప్రస్తుత పంట యాజమాన్య పద్ధతులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరువాక శాస్త్రవేత్త శ్రీ అనిల్ రెడ్డి గారు సోయాబీన్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు సూచించడం జరిగింది. అలాగే సోయాబీన్ వేసిన పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి , పొగాకు లద్దె పురుగు మరియు పల్లాకు తెగులు గమనించి తగు నివారణ చర్యలు తెలపడం జరిగినది. పొగాకు లద్దె పురుగు నివారణకు 1.65 ml నివాళ్యురాన్ 5.25% + ఇమమెక్టిన్ బెంజయోట్ 0.9% లేదా 0.3ml క్లోరాంట్రీనిప్రోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
అలాగే పల్లాకు తెగులు నివారణకు ఏసిఫేట్ 1.5 గ్రాము లేదా అసిటామీప్రైడ్ 0.3గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఎఫ్ పి ఓ చైర్మన్ చట్లవర్ గోపాల్, శక్కర్గ ఏఈ వో సరోజ , గ్రామ రైతులు పాల్గొన్నారు.