

జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కష్టపడితే దేనినైనా సాధించవచ్చు .ఏదీ అసాధ్యం కాదు. ఇదే మాటలను నమ్మి సామాన్య కుటుంబాలకు చెందిన ఆ యువకులు తమ లక్ష్యసాధన కొరకు ఎంతో కష్టపడ్డారు .శుక్రవారం వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో విజయం సాధించి కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు. వివరాలలోకి వెళితే బ్రాహ్మణచెరువుకు చెందిన సబ్బతి ప్రతాప్ కుమార్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు సత్యనారాయణ ,సరోజిని ఎంతో కష్టపడి వారి ముగ్గురు కుమారులని చదివించారు .రెండో సంతానమైన ప్రతాప్ కుమార్ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాడు ఇంటర్ వరకు చదివి రోజువారి కూలీగా పనులు చేసుకుంటూ కానిస్టేబుల్ ఉద్యోగం సాధన కోసం అహర్నిశలు శ్రమించాడు. పగలు కూలికి వెళ్లి రాత్రి చదువుకొని ఎటువంటి కోచింగ్లకు వెళ్లకుండా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి అందరి అభినందనలు పొందుతున్నాడు. సైకిల్ మెకానిక్ కుమారుడు పోలీసు కాట్రేనికొనలోని దేవి సెంటర్ కు చెందిన కేత వెంకటేశ్వరరావు సైకిల్ మెకానిక్ గా పని చేస్తున్నారు ఆయన భార్య సత్యవతి గృహిణి వారి కుమారుడు శ్రీనివాస్ శుక్రవారం వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. కుటుంబ పోషణకు ఎంతో కష్టపడే వెంకటేశ్వరరావు తన కుమారుడిని తనలా కాకుండా ఉన్నతంగా చదివించారు. తనకంటే మంచి ఉన్నతమైన స్థితికి చేరాలని మొదటి నుంచి కుమారుడికి నూరు పోసేవారు తండ్రి మాటలను అర్థం చేసుకున్న శ్రీనివాస్ చదువుకునే రోజుల నుంచే ఎంతో కష్టపడి పని చేయడం నేర్చుకున్నాడు దాంతోపాటు చదువు పైన దృష్టి సారించాడు ఖాళీ సమయాల్లో కూలిపనులకు వెళుతూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండు పోలీసు అవ్వాలని కసితో కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. తనకోసం ఎంతో శ్రమిస్తున్న తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని కంకణం కట్టుకొని అహర్నిశలు ఎంతో శ్రమించాడు తల చదువు ఖర్చులకు కష్టపడి సంపాదించుకునే ఇంటికి దూరంగా స్నేహితులతో కలిసి చదువుకొని కానిస్టేబుల్ కొలువు సాధించాడు సైకిల్ మెకానిక్ కుమారుడు పోలీసు అయ్యాడని గర్వంగా చెప్పుకునేలా శ్రీనివాస్ విజయం సాధించాడు
