Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

ఎర్రజెండా నిరంతరం పేద ప్రజాల పక్షాన పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్ట్ )సిపిఎం అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు.సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మునగాల మండలం పరిధిలోని కలకోవ గ్రామంలో సురభి వెంకట నారాయణ అధ్యక్షతన జరిగిన అమరవీరుల స్మారక సభ లో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ.. మునగాల పరగణ లో నాటి జమీందారు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం తొలి అమరుడు సీమ గురవయ్య, ముదిగొండ వీరయ్య, లతోపాటు అనేకమంది తమ ప్రాణాలను అర్పించారని. వారి ఆశయ సాధన కోసం ఎర్రజెండా నాయకత్వాన కలకోవ గ్రామంలో మండవ కోటయ్య నుండి నేటి మండల శాంతి బాబు వరకు అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి ఈ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ఎర్రజెండా నాయకత్వాన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని. అమరవీరుల స్మారక సభ ద్వారా వారి అందరిని యాదిలో ఉంచుకొని వారికి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ సత్యనారాయణ, జూలకంటి విజయలక్ష్మి, షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చందా చంద్రయ్య, ఎం వెంకటాద్రి, బి కృష్ణారెడ్డి, బి నాగయ్య, వెంకట కోటమ్మ, డి స్టాలిన్ రెడ్డి, ఎస్ పిచ్చయ్య,అనంత గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.