Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లి పలక రవి వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో తన కుటుంబ సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మాధవ్ బిజెపి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రవి తన మాటల్లో భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ పనితీరు మరియు ప్రంపంచ దేశాలతో గౌరవంతో కూడిన సత్సంబంధాలు వారికి దేశంపై ఉన్న భక్తి బావంతో బాద్యతగా తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు నామనస్సుకి నచ్చాయన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తులు ఉన్న పార్టీ లో నేను కూడా చేరాలని నిర్ణయించుకుని బిజెపి పార్టీ లో చేరడం ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ ,జిల్లా ప్రదాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు , ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి కర్రి రామక్రిష్ణ , జిల్లా ఉపాద్యక్షులు డి ఈశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.