

– G.O. No. 57 ద్వారా ఆదివాసీలకు సంక్షే మం, అభివృద్ధి మరియు రక్షణ కల్పించండి
– ఆదివాసి ఐక్యకార్య చరణ కమిటీ ఏలూరు జిల్లా చైర్మన్ మొడియం శ్రీనివాసరావు విన్నపం
– దోపిడీదారుల నుండి రక్షణ కల్పించండి
జనం న్యూస్/జనవరి28/బుట్టాయిగూడెం/రిపోర్టర్:సోమరాజు నడపాల : ఈ రోజు అనగా ది.26.01.25 ఆదివారం ఉదయం ఇటీవల కె.ఆర్.పురం ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన కేతావత్ రాములు నాయక్ ని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్,ఏలూరు జిల్లా ఆదివాసి ఐక్య కార్యచరణ కమిటీ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు,ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ కార్యదర్శి తెల్లం లక్ష్మణరావు ప్రాజెక్ట్ అధికారి వారి నివాస గృహంలో పుష్ప గుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో అనేక శాఖలలో సెక్షన్ అధికారిగా పనిచేసిన ఎంతో అనుభవం కలిగిన అధికారి రాములు నాయక్ ప్రాజెక్ట్ అధికారిగా రావటం సంతోషంగా ఉందని, వారికున్న అనుభవంతో ఈ ఐ టి డి ఏ కు వివిధ శాఖల నుంచి నిధులు రప్పించి ఈ ప్రాంత ఆదివాసులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంత చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 57 ద్వారా ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి మరియు దోపిడీదారుల నుండి రక్షణ కల్పించవలసిందిగా ప్రాజెక్ట్ అధికారిని కోరినట్లు, అందులకు ప్రాజెక్టు అధికారి సానుకూలంగా స్పందిస్తూ ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం,రక్షణ కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని శ్రీనివాసరావు స్థానిక మీడియా ముందు తెలియజేశారు.