

జనం న్యూస్ ఆగస్టు 2 కాట్రేనే కొన
శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళందరూ అమ్మవారికి ఈ రోజున నిమ్మకాయల తోటి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. శుక్రవారం పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులుసాయిబాబా, రామకృష్ణ పరమహంస, రాష్ట్ర బిజెపి కోశాధికారి గ్రంధి నానాజీ,గ్రంధి రాంప్రసాద్, పవన్ కుమార్, శ్రీకాంత్, కిరణ్, సంసాని వరప్రసాద్, గ్రంధి సత్తిబాబు, చెరుకు బాపి రాజు, చెరుకు కృష్ణ,తాతపూడి గోపి, యల్లమిల్లి రమేష్,రెడ్డి రత్నప్రసాద్, గ్రంధి వీర వెంకట సుబ్రహ్మణ్యం గారి దంపతులు, తదితరులు పాల్గొన్నారు.