Listen to this article

జనం న్యూస్ 2ఆగస్టు. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.

జైనూర్ మండలం గౌరి.1. అంగన్వాడి కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సి డి పి ఒ ఇందిర మాట్లాడుతూ తల్లిపాలకు ప్రాధాన్యత ఇవ్వండి: స్థిరమైన మద్దతు వ్యవస్థలను నిర్మించండి. మాతృత్వము ఒక వరము. గర్భవతులందరూ ప్రసవం జరిగే వరకు రక్తహీనత లేకుండా చూసుకోవాలి హాస్పిటల్ చెకప్స్ చేయించుకోవాలి. హాస్పిటల్లో ప్రసవం అవ్వాలి. బిడ్డ జన్మించిన వెంటనే తల్లిపాలు పట్టించాలి. ఆ సమయంలోనే బిడ్డ చాలా యాక్టివ్ గా ఉంటుంది. మొట్టమొదటగా వచ్చే తల్లిపాలను ముర్రుపాలు అంటారు ముర్రుపాలలో కోలాస్త్రం ఉంటుంది . బిడ్డకు మొట్టమొదటిగా ఇచ్చే వ్యాక్సిన్ ముర్రుపాలు ఇవి పట్టించడం వలన బిడ్డకు జీవితకాలము ఇమ్యూనిటీ ఉంటుంది.ప్రతి తల్లి ఇది గమనించాలి తర్వాత ఆరు నెలల లోపు కేవలం తల్లిపాలు( ఇతర ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వకపోవడం) ఇవ్వాలి. ఆపై రెండు సంవత్సరంల వరకు తల్లిపాలు ఇస్తూ ఏడవ నెల నుంచి అనుబంధాహారం మొదలు పెట్టాలి. దీనివలన బిడ్డ, తల్లి చాలా ఆరోగ్యంగా ఉంటారు కాన్పుకు కాన్పుకు గ్యాప్ ఏర్పడుతుంది. తల్లికి రొమ్ము క్యాన్సరు అయిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది బిడ్డకు కూడా ఇలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి పరిశుభ్రతలు పాటించాలి. అంగన్వాడీ కేంద్రంలో గాని ఇంట్లో గాని మంచి పోషకాహారము తీసుకోవాలి. వీటితోపాటు బిడ్డకు సంబంధించిన టీకాలన్నీ ఇప్పించాలి. బరువు ఎత్తు తీయించాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ సొంబాయి,ఏ ఎన్ ఎం సావిత్రి, ఆశావర్కర్లు ,అంగన్వాడి టీచర్లు విమల, సూర్యకాంత, షాహిదా బేగం, కమల, గర్భవతులు, తల్లులు హాజరైనారు.