Listen to this article

బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలే క్షేమం

బిచ్కుంద ఆగస్టు 2 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని కందర్ పల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సుశీల మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు ఈనెల ఒకటి నుండి ఈనెల 7 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి, ప్రసవమైన వెంటనే ముర్రుపాలు బిడ్డకు పట్టాలని ఆమె గర్భిణీ స్త్రీలకు సూచించారు. బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని,ఏడో నెల నుండి రెండున్నర సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలన్నారు. బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందని, తల్లికి కాన్పుకు ఎడం ఎడం దూరంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, వివో స్వరూప గర్భిణులు, బాలింతలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.