Listen to this article

కంగ్టి ఎస్ఐ ఎస్ దుర్గరెడ్డి,

జనం న్యూస్,ఆగస్ట్ 02,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని దెగులవాడి గ్రామ శివారులోని భూ యజమానులు తమ పంట చేళ్లలో గంజాయి సాగు చేయరాదన్న సదుద్దేశంతో శనివారం ఎస్ఐ దుర్గారెడ్డి,తమ సిబ్బందితో సందర్శించి పంట చేళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కంగ్టి మండల భూ యజమానులు తమ పంట చేళ్లలో గంజాయినీ సాగు చేసిన,రవాణా చేసినా, అమ్మిన,వేరొక్కరి దగ్గర కొన్న,చట్ట ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలు రద్దు చేయబడును రైతు బంధు,కరెంట్ కనెక్షన్, పంట బీమా లాంటి అన్ని ప్రభుత్వ పథకాలు నిలిపివేయడంతో పాటు,వారి పై చట్టపరమైన కేసులను నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని అన్నారు.భూ యజమానులు ఎవరైనా పత్తి చేనులో,కంది చేనులో,అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.