

జనం న్యూస్ ఆగస్టు 2,
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఉమెంతాల గ్రామంలో అంగన్వాడి టీచర్ సరళ,మెడికల్ ఆఫీసర్, ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యం, కానీ కొంతమంది తల్లులు ఉద్యోగరీత్యా ఇతర కారణాలవల్ల పిల్లలకు డబ్బా పాలు పట్టిస్తారు అందుకు తల్లిపాల గురించి మహిళల్లో అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సంస్థ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహిస్తుంది. తల్లిపాల వలన బిడ్డకు ఎదుగుదలకు తల్లిపాలు బిడ్డకు తొలి టీకాగా పనిచేస్తుంది. తల్లిపాల లో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్, ఉంటాయని అన్నారు. బిడ్డకు తల్లిపాలు వల్ల రొమ్ము క్యాన్సరు రాకుండా అరికడుతుందని, పాలవలన తల్లికి బిడ్డకు ప్రేమానురాగాలు బలపడతాయని అన్నారు. అందుకు తల్లిపాల అవశ్యకత గురించి వారోత్సవాలు నిర్వహిస్తున్నారని అందుకు తల్లులు తప్పకుండా బిడ్డకు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ స్వప్న మెడికల్ ఆఫీసర్, భాగ్యలక్ష్మి,ఆశాలు శారద, పారిజాత,యశోద,అంగన్వాడీ టీచర్ సరళ, ఆయాలు అనీఫా, అనూష,వినోద,గర్భినిలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.