

జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
టి జె యు గజ్వేల్ నియోజక వర్గం అధ్యక్షుడు గుడాల చంద్ర శేఖర్ కు సన్మానం
జనం న్యూస్, ఆగస్టు 2, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ కుమార్ )
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ( టి జె యు) గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షునిగా గుడాల చంద్రశేఖర్ గుప్తా ఇటీవల నియామకం అయ్యారు శనివారం గజ్వేల్ లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డిని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్తా ఈ సందర్భంగా గుడాల చంద్ర శేఖర్ ను అభినందించి శాలువాతో సత్కరించిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మేలు కలిగే విధంగా వార్తా కథనాలు రాస్తూ మంచి గుర్తింపు పొందిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు అభినందనీయులు అని, రాబోయే కాలంలో ప్రజా సమస్యలను మరింత వెలికి తీసి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, అభివృద్ది ప్రజల వద్దకు చేర్చి ప్రజలకు న్యాయం జరిగేలాగా జర్నలిస్టులు పనిచేయాలని కోరారు. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల మన్ననలు పొందేలాగా పాలన సాగిస్తున్నారని, కాంగ్రెస్ అంటేనే ప్రజా ప్రభుత్వమని, ప్రజల ప్రేమను వమ్ము చేయబోదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల తో పేదోడి గూడు కల నిజం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చిన ఘనత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కిందని, మరే ఇతర ముఖ్యమంత్రులు జర్నలిస్టుల అభ్యున్నతి కోసం పాటుపడలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ లు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
